ఇంటికి దీపం ఇల్లాలు అంటారు అని అందరికీ తెలిసిందే. మరి అలాంటి ఇల్లాలు తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కలిగే దుష్ప్రభావాలు ఏంటో చూద్దాం.
ఉదయం నిద్ర లేవగానే ఇంట్లో ఉండే ఆడవాళ్ళ దినచర్య మొదటగా టీ లేదా కాఫీ చేయడం, ఇది సహజం. కాబట్టి ఇంట్లో ఆడవాళ్లు ఎక్కువగా వంటగదికే పరిమితం అవడం చూస్తుంటాం. ఉదయం లేవగానే వాళ్ల దినచర్య ప్రారంభించే ముందు అంటే వంట గదిలోకి ప్రవేశించేటప్పుడు జుట్టు విరబోసుకుని వెళ్లడం మంచిది కాదు. ఉదయం నిద్ర లేవగానే మొదటగా పళ్ళు బ్రష్ చేసుకోవడం, ఆ తరువాత వంట గదిలోకి ప్రవేశించడం, ఆ ఇంటిల్లిపాదికి శుభం కలుగుతుంది.
వంట కార్యక్రమం మొదలు పెట్టేముందు స్నానం చేసి మడికట్టుకుని వంట గదిలో ఆ అగ్నిదేవుని నమస్కరించి మొదటగా ఒక గిన్నెలో పాలు తీసుకుని చక్కగా వంట కార్యక్రమాలు ప్రారంభించడం ఆ ఇంట్లో సమస్యలు రాకుండా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ఆస్కారం ఉంది.
ముఖ్యంగా ఇంట్లో ఉదయం నిద్ర లేవగానే ఇల్లు చిమ్ముకోవడం అయిన తర్వాతనే టిఫిన్ వండటం,తినడం చేయడం వల్ల ఆ తిన్న తిండి వంట బడుతుంది ఇంట్లో కూడా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఒకవేళ ఇల్లు చిమ్మకుండా టిఫిన్ లేదా ఫలహారం తీసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలే కాదు ఇంట్లో కూడా సమస్యలు వచ్చే ఆస్కారం చాలా ఎక్కువ అని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు.
ప్రతి ఇంట్లో ఆడవాళ్లు ఇవి తెలుసుకొని చక్కగా పాటించినట్లయితే ఆ ఇల్లు సుఖసంతోషాలతో వెలుగుతుంది. ప్రస్తుతం ఉన్న సమాజంలో పెద్దవారు చెప్పే మాటలను పక్కన పెట్టడం ఒక అలవాటుల మారిపోయింది. దీనివలన అనవసరంగా అనారోగ్యం పాలు కావడం, లేని సమస్యలు సృష్టించుకుని బాధపడడం అందరిలోనూ చూస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటివి మిస్ కాకుండా ఫాలో అవ్వడం అంతా శుభం.