దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేద విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు అందించింది. చదువులో ప్రతిభ కనబరిచే పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 6వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కు అర్హులు కాగా కనీసం 75 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అర్హత కలిగి ఉంటరు. ఎస్బీఐ ఫౌండేషన్ అందిస్తున్న ఈ స్కాలర్ షిప్ విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తోంది. 3 లక్షల రూపాయల కంటే కుటుంబ వార్షికాదాయం తక్కువగా ఉన్నవాళ్లు ఈ స్కాలర్ షిప్ కు అర్హత కలిగి ఉంటారు. https://www.sbifoundation.in/focus-area-detail/sbif-asha-scholarship వెబ్ సైట్ లింక్ ద్వారా స్కాలర్ షిప్ కోసం దరఖస్తు చేసుకోవచ్చు.
ఎస్బీఐ ఆశా స్కాలర్ షిప్ 2023 వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. మొబైల్ నంబర్ , ఇమెయిల్ ఇతర వివరాలను నమోదు చేసి ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్, ఆర్థిక పరిస్థితిని బట్టి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ నిర్వహించి స్కాలర్ షిప్ ను మంజూరు చేయడం జరుగుతుంది.
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్లు ఈ స్కాలర్ షిప్ పై దృష్టి పెడితే మంచిది. స్కాలర్ షిప్ గా 10,000 రూపాయలు అంటే తక్కువ మొత్తం కాదు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేనివారు ఈ స్కాలర్ షిప్ పై దృష్టి పెడితే ప్రయోజనం చేకూరుతుంది. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా ఈ స్కాలర్ షిప్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.