ఎస్బీఐ నుంచి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా.. అదిరిపోయే స్కీమ్స్ ఇవే!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్స్ ను అమలు చేస్తూ కస్టమర్లకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూర్చుతుండటం గమనార్హం. రెండు ప్రత్యేకమైన ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ ద్వారా కస్టమర్లకు ఎక్కువ మొత్తం వడ్డీ పొందే అవకాశం ఉంది. తక్కువ సమయంలో ఎలాంటి రిస్క్ లేకుండా లాభం పొందాలనుకుంటే ఈ స్కీమ్స్ పై దృష్టి పెడితే మంచిది.

ఈ స్కీమ్స్ పరిమిత కాలం ఆఫర్స్ కావడంతో సేవింగ్స్ చేయాలని భావించే వాళ్లు ఈ స్కీమ్స్ పై దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంది. ఎస్‌బీఐ అమృత్ కలశ్ పేరుతో ఒక స్కీమ్ అమలవుతుండగా ఎస్బీఐ ఉదయ్ కేర్ పేరుతో మరో స్కీమ్ అమలవుతోంది. ఎస్‌బీఐ ఉదయ్ కేర్ స్కీమ్ వల్ల సీనియర్ సిటిజన్లకు ఎంతగానో మేలు జరుగుతోంది. పదేళ్ల టెన్యూర్ తో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ అమలవుతున్నాయి.

ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా గరిష్టంగా 7.1 శాతం వరకు వడ్డీ రేటు లభించే అవకాశం అయితే ఉంటుంది. అమృత్ కలశ్ స్కీమ్ గడువు 400 రోజులు కాగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బుకు 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. తక్కువ సమయంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ఆదాయం పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు.

ఎస్బీఐ ఉదయ్ కేర్ స్కీమ్ ఐదేళ్ల నుంచి పదేళ్ల టెన్యూర్ తో అమలవుతుండగా ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోపు స్కీమ్ లో చేరాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో 21 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో భారీ ఆదాయం పొందాలని భావించేవాళ్లు వెంటనే ఈ స్కీమ్ పై దృష్టి పెట్టి డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.