రాత పరీక్ష లేకుండానే ఎస్బీఐలో భారీ సంఖ్యలో జాబ్స్.. నెలకు రూ.69000 జీతంతో?

ప్రముఖ బ్యాంక్ లలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా జూన్ 27వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

sbi.co.in అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మొత్తం 150 ఉద్యోగ ఖాళీలలో 61 జనరల్ కేటగిరీ ఉద్యోగాలు కాగా ఎస్సీలకు 25, ఎస్టీలకు 11, ఓబీసీకి 38, ఈడబ్ల్యూఎస్‌కు 15 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు హైదరాబాద్‌, కోల్‌కతాలో విధులు నిర్వహించాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.

ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ కావడంతో పాటు ఐఐబీఎఫ్ నుంచి ఫారెక్స్ లో సర్టిఫికెట్ కోర్స్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ట్రేడ్ ఫైనాన్స్ లో అనుభవంతో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాసెసింగ్ నైపుణ్యాలు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అర్హత, అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

100 మార్కులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇంటర్వ్యూను నిర్వహిస్తారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 69 వేల రూపాయల వేతనం లభించే ఛాన్స్ ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఒకింత ఎక్కువగానే ఉండనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటే ఎక్కువ మొత్తం బెనిఫిట్స్ పొందవచ్చు.