దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగిస్తున్న సంగతి తెలిసిందే. అతిపెద్ద బ్యాంక్ లలో ఒకటైన ఎస్బీఐ రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాల నియామకాలకు సిద్ధమైందని తెలుస్తోంది. ఎస్బీఐ రిటైల్ ప్రొడక్ట్స్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. మార్చి 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. మిగిలిన వాళ్లకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది. ఎంబీఏ (మార్కెటింగ్), పీజీడీఎం/ పీజీపీఎం (మార్కెటింగ్) చదివిన వాళ్లు మేనేజర్ రిటైల్ ప్రాడక్ట్స్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీ, అనుభవం ఉన్నవాళ్లు ఫ్యాకల్టీ (ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్) ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ముంబయి, ఎస్‌బీఐఎల్, కోల్‌కతాలో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఉంటుంది.
ఎస్బీఐ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అనుభవం ఉన్న ఉద్యోగులకి ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఎంతగానో బెనిఫిట్ కలుగుతోంది.