ఎలాంటి విద్యార్హత లేకుండా ఎస్బీఐలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

Job-Vacancy

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

 

జూన్ నెల 15వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2023 సంవత్సరం జులై నెల 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. మొత్తం 194 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలలో ఎఫ్‌ఎల్‌సి కౌన్సెలర్‌ ఉద్యోగ ఖాళీలు 182 ఉండగా ఎఫ్‌ఎల్‌సి డైరెక్టర్‌ పోస్టులు 12 ఉన్నాయి.

 

60 నుంచి 63 సంవత్సరాల వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అభ్యర్థులు 65 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే పని చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు అర్హతల ఆధారంగా వేతనం పొందే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. 100 మార్కులకు నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది.

 

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 35,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది. ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు సులువుగా ఎంపికయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది.