నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. ఎస్బీఐలో 6,000కు పైగా అప్రెంటీస్ జాబ్స్!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. డిగ్రీ పాసై బ్యాంక్ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. భారీ సంఖ్యలో అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 6,160 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా సెప్టెంబర్ 21వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలలో ఏపీలో 390 ఉద్యోగ ఖాళీలు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో 125 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. రిజర్వేషన్ల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది. శిక్షణ సమయంలో ఉద్యోగులకు 15,000 రూపాయల స్టైఫండ్ లభిస్తుంది. 2023 సంవత్సరం ఆగష్టు 1వ తేదీ నాటికి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.

రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రాతపరీక్ష అక్టోబర్ లేదా నవంబర్ లో జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈ.డబ్ల్యూ.ఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి పూర్తిస్థాయిలో మినహాయింపులు ఉండనున్నాయి.