ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్ జాబ్స్.. డిగ్రీ అర్హతతో?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేట్ అయ్యి బ్యాంక్ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు తీపికబురు అందించింది. డిప్యూటీ మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. నవంబర్ నెల 7వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. sbi.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం 42 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. వెబ్ సైట్ లో దరఖాస్తు లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేయవచ్చు. అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. రాతపరీక్ష లేకుండా ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుసగా జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.