పదో తరగతి పాసైన వాళ్లకు తీపికబురు.. సెయిల్ లో అటెండెంట్,ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలు!

రూర్కెలాలో ఉన్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 30 టెక్నీషియన్ పోస్టులు, 110 అటెండర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పదో తరగతి ఉత్తీర్ణతో పాటు సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. sail.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

నవంబర్ నెల 20వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా డిసెంబర్ 16వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు 650 రూపాయలు కాగా అటెండెంట్ పోస్టుకు దరఖాస్తు రుసుము 400 రూపాయలుగా ఉందని సమాచారం అందుతోంది. సంబంధిత రంగంలో డిప్లొమా సర్టిఫికేట్‌తో పాటు 10వ తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.

ఈ ఉద్యోగాలకు వయో పరిమితి కనిష్టంగా 18 సంవత్సరాలు ఉండగా గరిష్టంగా 28 సంవత్సరాలుగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు ఎస్-3 గ్రేడ్ కింద రూ.26,600 నుంచి రూ.38,920 వరకు వేతనం లభించే అవకాశం ఉంటుంది. అటెండర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఎస్1 గ్రేడ్ కింద రూ.25070 నుంచి 35070 వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.

సెయిల్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. కేవలం పదో తరగతి అర్హతతో 40 వేల రూపాయల వేతనం లభించడం అంటే శుభవార్త అనే చెప్పాలి. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని సమాచారం అందుతోంది.