స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలతో పాటు అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (ట్రైనీ) ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. సెయిల్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2023 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్, ఇతర ట్రేడ్ లలో మొత్తం 110 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. గుర్తింపు పొందిన సంస్థ నుండి మెకానికల్ / ఎలక్ట్రికల్ / కెమికల్ / పవర్ ప్లాంట్ / ప్రొడక్షన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగంలో మూడేళ్ల పాటు డిప్లొమాతో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన వాళ్లు ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.
ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన సంస్థ నుండి మెకానిక్/కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఇతర విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసిన వాళ్లు అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (ట్రైనీ) ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 12,900 రూపాయల నుంచి 26600 రూపాయల వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలుగా ఉందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుండగా అర్హతలు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.