డిగ్రీ అర్హతతో సెయిల్ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు లక్షా 80 వేల వేతనంతో?

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 92 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్, ఇతర విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిసెంబర్ నెల 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండనుంది. sail.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 700 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలుగా ఉండనుంది. సంబంధిత బ్రాంచ్ లో బీటెక్ డిగ్రీ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా అర్హత ఉన్నవాళ్లు కనీసం 65 శాతం మార్కులు పొంది ఉండాలి. డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు 25 సంవత్సరాలు ఏజ్ లిమిట్ కాగా ఓబీసీ అభ్యర్థులకు 31 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు ఏజ్ లిమిట్ గా ఉంది.

కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్షకు హాజరై అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. శిక్షణ సమయంలో నెలకు రూ.50,000 వేతనం కాగా శిక్షణ పూర్తైన తర్వాత రూ.1,80000 వరకు వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.

అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.