స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మొత్తం 41 ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. sail.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 2024 సంవత్సరం జనవరి నెల 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. సంబంధిత విద్యార్హతలను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అధికారిక నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు వయో పరిమితి విషయంలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారాఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 700 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలుగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుండగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
సెయిల్ ప్రముఖ సంస్థ కావడంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఒకింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సెయిల్ లో ఉద్యోగ ఖాళీలు కావాలని కోరుకునే వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలపై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు.