నిరుద్యోగులకు అలర్ట్.. పది అర్హతతో స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారీ వేతనంతో జాబ్స్!

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మసాజ్ థెరపిస్ట్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. జూన్ నెల 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండటం గమనార్హం. మొత్తం 9 ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

ఇప్పటికే స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉన్నవాళ్లకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని సమాచారం అందుతోంది. రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. 100 మార్కులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష ఉంటుంది. కేవలం గంట వ్యవధిలో ఈ ఉద్యోగ ఖాళీకి సంబంధించిన పరీక్షను రాయాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.

 

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 35,000 రూపాయల వేతనం లభించనుందని తెలుస్తోంది. ది ప్రిన్సిపాల్, లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కార్యవట్టం , తిరువనంతపురం-695581, కేరళ అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.

 

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు 8 సంవత్సరాల పాటు పని చెసే అవకాశం అయితే ఉంటుంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల అర్హత ఉన్న నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతోంది.