నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. రైల్వేలో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు!

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ప్రయోజనం చేకూరేలా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. 9,000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధమైంది. దేశంలోని అన్ని రైల్వే రీజియన్లలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మార్చి నెల 9వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ నెల 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

టెక్నీషియన్ గ్రేడ్1 సిగ్నల్ ఉద్యోగ ఖాళీలు 1100 ఉండగా టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్ ఉద్యోగ ఖాళీలు 7900 ఉన్నాయి. మొత్తం 9000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఒకింత ఎక్కువగానే ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఖాళీలు, విద్యార్హత, రాత పరీక్ష, సిలబస్‌ ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. టెక్నీషియన్ గ్రేడ్1 సిగ్నల్ జాబ్స్ కు 18 నుంచి 36 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, పీడబ్ల్యూడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలు కాగా ఇతరులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంది. ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ , ఇతర పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం, ఇతర రీజియన్లలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ ఉద్యోగానికి ఎంపికైన వాళ్లకు నెలకు 29,200 రూపాయల వేతనం లభించనుండగా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 19,900 రూపాయల వేతనం లభిస్తుందని చెప్పవచ్చు.