రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 220 లెక్చరర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
నవంబర్ నెల 27వ తేదీలోగా సెల్ఫ్ అటెస్టేషన్ చేయించిన డాక్యుమెంట్లను ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ కు పంపాలి. రిజర్వేషన్ల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. కెమిస్ట్రీ విభాగంలో 36, బయాలజీ విభాగంలో 8, ఇంగ్లీష్ 24, డ్యాన్స్ 4, ఐటీలో 28, ఫైన్ ఆర్ట్స్ విభాగంలో 4, లైబ్రరీ విభాగంలో 8, యోగా 4, తెలుగు 16, సైకాలజీ 4, ఫిజిక్స్ 36, ఫిజికల్ ఎడ్యుకేషన్ 12, మ్యూజిక్ 4, మ్యాథమేటిక్స్ విభాగంలో 32 ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 57,100 రూపాయల నుంచి 1,47,760 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల ద్వారా ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
180 నిమిషాల పాటు ఈ పరీక్షను నిర్వహిస్తారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 2500 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 2000 రూపాయలుగా ఉండనుంది. మెరిట్ జాబితా ఆధారంగా స్క్రీనింగ్ చేసి రాతపరీక్షను నిర్వహిస్తారు. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే ప్రయోజనాలు చేకూరుతాయి.