నిరుద్యోగులకు తీపికబురు.. రిజర్వ్ బ్యాంక్ లో భారీ వేతనంతో ఉద్యోగాలు?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. opportunities.rbi.org.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

ఈ సంవత్సరం గ్రేడ్ బీ ఆఫీసర్స్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలలో ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ ఉద్యోగ ఖాళీలు 222 ఉండగా, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ ఉద్యోగ ఖాళీలు 38 ఉన్నాయి. మిగతా ఉద్యోగ ఖాళీలు మాత్రం 31 ఉండటం గమనార్హం.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు భారీగానే వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన ఉద్యోగులకు ఇతర బెనిఫిట్స్ కూడా లభించనున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా అర్హత ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అర్హత, ఆసక్తి ఆధారంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ అవుతుండటం గమనార్హం.