ఇంటర్ అర్హతతో రైల్వేలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

దేశంలో రైల్వే ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూస్తున్న యువతకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. పది, ఇంటర్ పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే వాళ్లకు అదిరిపోయే శుభవార్త వెలువడింది. పాటియాలా లోకోమోటివ్ వర్క్స్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. plw.indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మొత్తం 295 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. అక్టోబర్ నెల 9వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. 2023 సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ఎలక్ట్రీషియన్ 140, మెకానిక్ (డీజిల్) 40, మెషినిస్ట్ 15, ఫిట్టర్ 75, వెల్డర్ 25 ఉన్నాయి.

గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 12వ తరగతి పాస్ కావడంతో పాటు పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులు సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ మరియు ఫిట్టర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

వెల్డర్ ఉద్యోగ ఖాళీల కోసం మాత్రం 15 నుంచి 22 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ జాబ్ నోటిఫికేషన్ పై దృష్టి పెడితే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకురుతుందని చెప్పవచ్చు.