నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. రాతపరీక్ష లేకుండా రైల్వేలో ఉద్యోగ ఖాళీలు!

గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. 1104 ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా 1104 యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

జులై నెల 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. కనీసం 50 % మార్కులతో పదో తరగతి సహా, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.

2024 జూన్ 12 నాటికి 15 ఏళ్ల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండగా ఎస్టీ, ఎస్సీలు,మహిళలు, దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని సమాచారం అందుతోంది.

పదో తరగతి, ఐటీఐ పరీక్షలలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉండనుందని సమాచారం అందుతోంది. ఈ జాబ్స్ కు ఎంపికైన వాళ్లకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల మేరకు శిక్షణ కాలంలో స్టైపెండ్ చెల్లిస్తారని సమాచారం అందుతోంది.