రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శాలరీ, వయోపరిమితి, అర్హత, ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ లో మొత్తం 81 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) ఉద్యోగ ఖాళీలు 27 ఉండగా అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) ఉద్యోగ ఖాళీలు 26, డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్) ఉద్యోగ ఖాళీలు 15 ఉన్నాయి.
అసిస్టెంట్ మేనేజర్ (హెచ్‌ఆర్) ఉద్యోగ ఖాళీలు 7 ఉండగా అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) ఉద్యోగ ఖాళీలు 6 ఉన్నాయి. డిప్లొమా,డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ బ్రాంచ్‌ల యొక్క ఏదైనా ఇతర కాంబినేషన్ చేసిన వాళ్లు అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) ఉద్యోగాలకు అర్హులు.
ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్‌లో సమానమైన బ్రాంచ్‌లలో ఒకటిగా ఉంది. రాత పరీక్ష/ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 1,40,000 రూపాయల వరకు వేతనం లభించనుంది.
21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 600 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు 1200 రూపాయలుగా ఉంది. 2023 సంవత్సరం నవంబర్ 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండనుందని తెలుస్తోంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.