చాలామందికి సహజంగానే వారు తినే ఆహారంలో కారం ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. తీసుకునే ప్రతి ఆహారం కూడా స్పైసి గా ఉండాలనేది వారి కోరిక. ఇంకొంతమంది కారం ఎక్కువ తింటే పౌరుషం వస్తుందనే మూఢ నమ్మకం వల్ల కూడా తింటూ ఉంటారు. అయితే ఆహారంలో కారం ఎక్కువగా ఉండటం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి.
కారం ఎక్కువగా ఈతినడం వల్ల కలిగే లాభాలు:
మిరపకాయల్లో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. అలాగే అవి యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల దగ్గు, జలుబు ఉన్నవారు కారం తింటే త్వరగా వాటి నుంచి బయట పడవచ్చు. శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కనుక ఆయా సమస్యలు ఉన్నవారు అవి తగ్గే వరకు కారం తినవచ్చు.
* మిరపకాయల్లో క్యాప్సెయిసిన్ అనబడే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది మన శరీర మెటబాలిజంను పెంచుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అందువల్ల కారంను నిత్యం కొంత మోతాదులో తీసుకుంటే ఫలితం ఉంటుంది.
* మిరపకాయల్లో మన శరీరానికి అవసరం అయ్యే పోషకాలు ఉంటాయి. ఇవి అధిక బరువు, డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తాయి. అందువల్ల వారు నిత్యం కారంను మితంగా తీసుకుంటే మంచిది.
* కారం ఉండే ఆహారాలను కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం ఉండదు. జీర్ణ సమస్యలు పోతాయి.
కారం ఎక్కువగా తినడం వల్ల నష్టాలు:
అయితే కారం తినమన్నాం కదా అని చెప్పి నిత్యం అధిక మొత్తంలో దాన్ని తీసుకుంటే నష్టాలే కలుగుతాయి. ముఖ్యంగా
* కారం ఎక్కువగా తినడం వల్ల చెమట ఎక్కువగా వస్తుంది. దీంతో ఇబ్బందులు వస్తాయి. అలాగే అసిడిటీ, గ్యాస్ వస్తాయి.
*కొన్ని సార్లు విరేచనాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
*అలాగే నాలుకపై ఉండే రుచికళికలు రుచిని పసిగట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయి.
*చర్మంపై కొందరికి దద్దుర్లు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
కనుక ఎవరైనా సరే.. పరిమిత మోతాదులో కారంను తీసుకోవడం వల్ల పైన తెలిపిన లాభాలను పొందవచ్చు. ఏదైనా తగినంత తీసుకుంటేనే మంచిది. అతిగా ఇది తిన్నా మనకు అది హాని చేస్తుంది.