“ఒబేసిటీ” ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య. వయసుతో నిమిత్తం లేకుండా ఈ వ్యాధి అందరిని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఒబేసిటీ అంటే శరీరంలో అవసరమైన కొవ్వు కంటే కూడా ఎక్కువ కొవ్వు నిల్వ ఉండటం. ఇలా శరీరంలో కొవ్వు నిలువ ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే చాలామంది తాము చేస్తున్న తప్పులు ఎంతో తెలియకుండానే ఈ వ్యాధి భారిన పడుతూ ఉంటారు. ఒకవేళ మీకు కూడా ఒబేసిటీకు గల కారణాలు ఎంతో తెలియకపోతే ఈ ఆర్టికల్ మీకు హెల్ప్ చేస్తుంది.
ఒబేసిటీ రావడానికి గల కారణాలు:
*రోజు తీసుకునే ఆహారంలో ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం.
*వ్యాయామం చేయకపోవడం కారణంగా చాలా మంది ఒబేసిటీ బారిన పడుతున్నారు.
ఒబేసిటీ వల్ల కలిగే నష్టాలు:
*ఒబేసిటీ వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
* నిద్రలో ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం
* కీళ్ళకు సంబంధించిన వ్యాధులు
* కొన్ని రకాలైన క్యాన్సర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది .
ఇక తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో ఒబేసిటీ గురించి మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది . పొట్ట పెరిగే కొద్దీ మెదడులోని మెమొరీ తగ్గిపోతుందని లండన్ యూనివర్సిటీ కాలేజీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఒబేసిటీ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు:
*ఇక సరైన పద్దతిలో ఆహారం తీసుకోవాలి
* క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి.
* జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచాలి. అంటే మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.
* మద్యం తాగడం, చిరుతిళ్ళు, స్వీట్స్ తినడం తగ్గించుకోవాలి.
*ఇక ఎక్కువసేపు కూర్చొని ఉండేవారికి పొట్ట భాగం అధికంగా ఉంటుంది. కాబట్టి, ఎక్కువసేపు కూర్చునే వారు మధ్య మధ్యలో ఖచ్చితంగా పైకి లేచి అటు ఇటు నడవాలి. అలాగే వెల్లుల్లి, అల్లం, నిమ్మ వంటివి డైట్‌లో చేర్చుకుంటే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అని నిపుణులు సలహా ఇస్తున్నారు .