ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగుతున్నాయా.. సమస్యకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

ప్రస్తుత కాలంలో ప్రతి కుటుంబంలో గ్యాస్ సిలిండర్ ను వాడటం సాధారణమైందనే సంగతి తెలిసిందే. గ్యాస్ సిలిండర్ ధరలు ఎంత పెరిగినా గ్యాస్ సిలిండర్ వినియోగదారుల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అయితే గ్యాస్ సిలిండర్ ను వినియోగించే వాళ్లలో చాలామంది మంటలు చెలరేగితే ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల నష్టపోయిన కుటుంబాల గురించి మనం తరచూ వార్తల్లో వింటూ ఉంటాం. గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగుతుంటే మొదట కిటికీలను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత నీళ్లతో ఉన్న బకెట్ సహాయంతో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు కూడా అదిమిపట్టి మంటలను ఆర్పాలి. ఈ విధంగా చేయడం ద్వారా సులువుగానే మంటలు ఆరిపోతాయని చెప్పవచ్చు.

గ్యాస్ సిలిండర్ లు పేలితే ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే ఇన్సూరెన్స్ లభిస్తుంది. సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. గ్యాస్ లీకైన సమయంలో కళ్లు, ముక్కును కవర్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. గ్యాస్ సిలిండర్ లీక్ అయిన సమయంలో ఏవైనా తప్పులు చేస్తే ప్రాణాలకు అపాయం కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

గ్యాస్ లీకైన తర్వాత ఏవైనా ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే మంచిది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం కలిగే అవకాశాలు ఉంటాయి. గ్యాస్ సిలిండర్ ను వినియోగించే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.