పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. రాత పరీక్ష లేకుండానే?

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 435 పోస్టుల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. powergrid.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉండగా జులై నెల 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. కనీసం 60 శాతం మార్కులు సాధించిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉద్యోగ ఖాళీలకు సంబంధించి వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మేన్ లకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. మిగతా వాళ్లు మాత్రం ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి 500 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు కోరుకునే వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలపై దృష్టి పెట్టడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. పవర్ గ్రిడ్ జాబ్ నోటిఫికేషన్ నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజైన నేపథ్యంలో ఈ ఉద్యోగాలకు ఒకింత ఎక్కువగానే పోటీ అయితే ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత ఎక్కువ మొత్తంలో వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.