పది అర్హతతో పోస్టల్ శాఖలో మరో 12,000 జాబ్స్.. అత్యంత భారీ వేతనంతో?

పోస్టాఫీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మరో 12828 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం భారీ జాబ్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. దేశంలోని వేర్వేరు పోస్టాఫీస్ బ్రాంచ్ లలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం.

https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలలో ఏపీలో 118 తెలంగాణలో 96 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. 2023 సంవత్సరం జూన్ 11 నాటికి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. పదో తరగతి వరకు తెలుగు చదివిన వాళ్లు మాత్రమే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 10,000 రూపాయల నుంచి 29,380 రూపాయల వరకు వేతనం లభించే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ ఉమెన్ లకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. బీపీఎం, ఏబీపీఎం ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం పోస్టల్ శాఖ ఈ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. బీపీఎం ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు బ్యాంక్ కార్యకలాపాలతో పాటు పేమెంట్ వ్యవహారాలను చూస్కోవాలి.

అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు ఉత్తరాల పంపిణీ, స్టాంపులు, స్టేషనరీకి సంబంధించిన బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ కు ఎంపికైన వాళ్లు పోస్టాఫీస్ స్కీమ్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.