దేశంలో చాలామంది కనీసం పదో తరగతి చదివి ఉంటారు. పది అర్హతతో మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకు పోస్టల్ శాఖ అదిరిపోయే తీపికబురు అందించింది. పది అర్హతతో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు 19900 రూపాయల నుంచి 63200 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. 56 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్ ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, హర్యానా సర్కిల్, ది మాల్, అంబాలా కంటోన్మెంట్ – 133001 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఏప్రిల్ 17వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మే నెల 10వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుండగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను ఇండియా పోస్ట్ వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.