ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు పోస్టాఫీస్ స్కీమ్స్ పై దృష్టి పెడితే మంచిది. డబ్బులు దాచుకునేందుకు స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు సహా ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నా ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే గ్యారంటీ రిటర్న్ లు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో ఆదాయం వస్తుందని చెప్పవచ్చు.
చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టాలని భావించే వాళ్లు సైతం పోస్టాఫీస్ స్కీమ్స్ పై ఫోకస్ పెడితే మంచిది. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో ఆదాయం సొంతమవుతుంది. ఈ స్కీమ్ పై ప్రస్తుతం 7 శాతం వడ్డీ రేటు అమలులో ఉంది. కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టే ఛాన్స్ ఉండగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే గరిష్ట మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు.
లక్ష రూపాయలు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే ఐదేళ్ల తర్వాత రూ.44,995 వడ్డీ పొందే అవకాశం అయితే ఉంటుంది. 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ఏకంగా రూ. 7,24,974 పొందే ఛాన్స్ ఉంటుంది. పోస్టాఫీస్ బ్రాంచ్ ల ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
పెట్టుబడి పెట్టే మొత్తం, ఎన్ని సంవత్సరాల పాటు డబ్బులను ఇన్వెస్ట్ చేస్తాం అనే విషయాల ఆధారంగా మనం పొందే మొత్తం ఆధారపడి ఉంటుంది. రూ. లక్ష పెట్టుబడి పెడితే ఏడాది తిరిగేసరికి రూ. 1,07,081 పొందే అవాకాశం ఉండగా మూడేళ్ల తర్వాత ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు లక్షా 23 వేల రూపాయలు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. 9 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు డబ్బులు పొందే అవకాశం ఉంటుంది.