ఈ పోస్టాఫీస్ స్కీమ్ తో నెలకు రూ.8 వేలు పొందే ఛాన్స్.. ఎలా అంటే?

మనలో చాలామంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రయోజనం చేకూరేలా పోస్టఫీస్ స్కీమ్స్ పై ఆధారపడుతున్నారు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలలో బెనిఫిట్స్ పొందవచ్చు. నెల నెలా రాబడి కోరుకునే వాళ్లు పోస్టాఫీస్ మంత్లీ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఈ స్కీమ్ లో 9 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే 15 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది.

ఎక్కువ మొత్తంలో పొదుపు చేయాలని భావించే వాళ్లు సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ గురించి తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా ఖాతాలో గరిష్టంగా ప్రతి నెలా 8875 రూపాయలు డిపాజిట్ అవుతాయి. పదేళ్లకు పైగా వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు కాగా ఈ స్కీమ్ పై ప్రస్తుతం ఏకంగా 7.1 శాతం వడ్డీ అమలవుతుండటం గమనార్హం.

సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్ ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది. వడ్డీని విత్ డ్రా చేసుకోకపోయినా ఆ మొత్తంపై అదనపు వడ్దీ అయితే లభించదు. రాబోయే రోజుల్లో కేంద్రం ఈ స్కీమ్ లిమిట్ ను మరింత పెంచే అవకాశాలు అయితే ఉంటాయి. ఎలాంటి కఠిన నిబంధనలు లేకుండా ఈ స్కీమ్ అమలవుతోంది. పోస్టాఫీస్ ఖాతాదారులకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని ఈ స్కీమ్ ను అమలు చేస్తోండగా ఇప్పటికే కోట్ల సంఖ్యలో ప్రజలు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందారు. ఈ స్కీమ్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా 600 రూపాయలు వస్తాయి. ఇన్వెస్ట్ చేసే మొత్తం పెరిగే కొద్దీ ఈ స్కీమ్ ద్వారా పొందే మొత్తం కూడా అంతకంతకూ పెరుగుతుంది.