దేశంలో 44 వేలకు పైగా పోస్టల్ ఉద్యోగ ఖాళీలు.. ఫలితాలు ఎలా తెలుసుకోవాలంటే?

మన దేశంలో ప్రతి సంవత్సరం ఎక్కువ సంఖ్యలో రిలీజయ్యే ఉద్యోగ ఖాళీలలో పోస్టల్ జాబ్స్ ఒకటి. గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగ ఖాళీల భర్తీకి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన మెరిట్ జాబితాను తాజాగా పోస్టల్ శాఖ విడుదల చేయగా పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

కేవలం పదో తరగతి అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. indiapostgdsonline.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే జాబ్ నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తు చేసుకోవడం జరిగింది.

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తపాలా శాఖ ఈ-మెయిల్‌ ద్వారా లేదా ఫోన్‌ నంబర్‌కు మెసేజ్‌ ద్వారా లేదా పోస్టు ద్వారా ఉద్యోగాలకు ఎంపికైనట్టు సమాచారం ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలను పరిశీలిస్తే ఏపీలో 1355 ఉద్యోగ ఖాళీలు ఉండగా తెలంగాణలో 981 ఉన్నాయి. మొదటి సెలక్షన్ లిస్ట్ లో జాబ్ వచ్చినా వేర్వేరు కారణాల వల్ల ఉద్యోగాలకు ఎంపిక కాని వాళ్లు తర్వత సెలక్షన్ లిస్ట్ లో ఎంపికయ్యే ఛాన్స్ ఉంటుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్‌ సేవక్‌ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన విధులలో పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వాళ్లకు 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. రోజుకు 3 నుంచి 4 గంటలు పని చేయడం ద్వారా ఈ ఉద్యోగాన్ని సులువుగా నిర్వహించవచ్చు.