దేశంలో పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు పోస్టాఫీస్ స్కీమ్స్ పై ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. పోస్టాఫీస్ స్కీమ్స్ లో కొన్ని స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలో వడ్డీ పొందే అవకాశంతో పాటు అదిరిపోయే రాబడిని పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ఇండియా పోస్ట్ అందిస్తున్న ఉత్తమమైన స్కీమ్స్ లో ఒకటి అని చెప్పవచ్చు.
1 నుంచి 5 సంవత్సరాల వరకు వివిధ టర్మ్ ఆప్షన్లతో ఈ స్కీమ్ అమలవుతూ ఉండటం గమనార్హం. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో ఐదేళ్ల పాటు డబ్బులు డిపాజిట్ చేస్తే ఏకంగా 7.5 శాతం వడ్డీ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఐదేళ్లు ఎదురు చూస్తే 2.25 లక్షల రూపాయల వడ్డీ సొంతమవుతుంది.
ఈ స్కీమ్ కు సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి. వడ్డీ రేట్లలో మార్పుల వల్ల మనం ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి పొందే వడ్డీలో మార్పు ఉంటుందని తెలుస్తోంది. 5 సంవత్సరాల తర్వాత ఈ స్కీమ్ ను అవసరాలకు అనుగుణంగా పొడిగించుకోవాలని అనుకుంటే పొడిగించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుపై లోన్ తీసుకోవచ్చు.
ఎక్కువ మొత్తంలో రాబడి పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది. ఇతర స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే కచ్చితమైన రాబడిని పొందుతామో లేదో చెప్పలేం. అందువల్ల ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల భారీ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.