సీనియర్ సిటిజన్స్ లో చాలామంది సరైన ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ప్రయోజనం చేకూరేలా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పేరుతో పోస్టాఫీస్ స్కీమ్స్ అమలవుతున్నాయి. కనీసం 1000 రూపాయల నుంచి గరిష్టంగా 30 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇనెస్ట్ చేయడం ద్వారా భారీ మొత్తంలో వడ్డీ లభిస్తుంది.
రిటైర్ అయిన తర్వాత ప్రతి నెలా ఆదాయం పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై ఫోకస్ పెడితే మంచిది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఏకంగా 8.2 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 60 సంవత్సరాల కంటే వయస్సు పైబడిన వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెట్టవచ్చు. పదవీ విరమణ పొందిన వాళ్లు సైతం ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పెట్టుబడి పెట్టే మొత్తాన్ని బట్టి వడ్డీ పొందే అవకాశాలు ఉంటాయి.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ స్కీమ్ కోసం జాయింట్ అకౌంట్ ను కూడా ఓపెన్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో 30 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు 20,000 రూపాయల వడ్డీ పొందే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఏడాదికి దాదాపుగా 2.5 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు సంబంధించి 5 ఏళ్లలో ఓపెన్ చేసిన ఖాతా మెచ్యూర్ అవుతుంది.