తక్కువ పెట్టుబడితో రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. పోస్టాఫీస్ మనీ సేవింగ్స్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలు సొంతమవుతాయి. రిటైర్మెంట్ తర్వాత వడ్డీ ఆదాయం పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్స్ పై దృష్టి పెడితే మంచిది. 60 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెట్టవచ్చు.
పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం పొందాలని కోరుకునే వాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పేరుతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ విధంగా ఐదేళ్లు డిపాజిట్ చేస్తే ఐదేళ్ల తర్వాత 7 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. 5 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెడితే 2 లక్షల రూపాయల లాభం వస్తుంది.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు 7.4 శాతం వడ్డీ లభించే అవకాశాలు ఉంటాయి. మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ మొత్తం పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ లభించే అవకాశాలు ఉంటాయి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు మరో మూడేళ్ల పాటు స్కీమ్ ను పొడిగించుకునే అవకాశాలు అయితే ఉంటాయి.
55 ఏళ్లు దాటిన ప్రభుత్వోద్యోగులు కూడా పదవీ విరమణ చేసిన నెల రోజుల్లోనే ఈ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. డిఫెన్స్ సిబ్బందికి వయోపరిమితి 50 సంవత్సరాలుగా ఉందని సమాచారం అందుతోంది. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు ఈ స్కీమ్స్ పై దృష్టి పెడితే మంచిది.