ప్రపంచ దేశాల్లోనే జనాభా పరంగా భారత్ నంబర్ వన్ అనే సంగతి తెలిసిందే. అయితే మన దేశంలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. దేశంలో ఉద్యోగం లేక ఎంతోమంది నిత్య జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే బ్రిటన్ లోని ప్రముఖ కంపెనీ నెలకు లక్షన్నర రూపాయలు వేతనం పొందే అవకాశాన్ని అయితే కల్పిస్తుండటం గమనార్హం. ఫీల్ కంప్లీట్ అనే సంస్థ సరికొత్త ఉద్యోగానికి ఈ స్థాయి వేతనాన్ని ఆఫర్ చేస్తోంది.
ఈ ఉద్యోగంలో చేరిన వాళ్లు మలం వాసన చూడాల్సి ఉంటుంది. సంస్థ శిక్షణ ఇచ్చి ఈ ఉద్యోగంలో చేర్చుకుంటుంది. వాసన చూడటం ద్వారా జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుందో లేదో తెలుసుకోవడంతో పాటు ఏదైనా పోషకాల లోపం ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. వేతనం భారీగా ఉన్నా ఎక్కువమంది ఈ జాబ్ పై ఆసక్తి చూపరు.
21 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకే ఒక ఖాళీ ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ సైతం ఎక్కువగానే ఉంటుందని సమాచారం అందుతోంది. మలం యొక్క వాసన వేర్వేరు వాసనలను సూచిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఉద్యోగం వినడానికే వింతగా ఉందని కొంతమంది వెల్లడిస్తున్నారు.
జీర్ణ వ్యవస్థ సమస్యలు ఉన్నవాళ్ల సమస్యలు తెలుసుకోవడం కోసం ఈ ఉద్యోగులను నియమించుకుంటారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రాబోయే రోజుల్లో వేతనం పెరుగుతుంది. ఈ తరహా ఉద్యోగాల గురించి వినడం ఇదే తొలిసారని చాలామంది చెబుతున్నారు.
