కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈ నెల 18వ తేదీన రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ నగదును జమ చేసిన సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ యోజన 17వ విడత డబ్బు తాజాగా రిలీజ్ కావడం రైతులకు మేలు చేస్తోంది. ఈ మొత్తం రైతులకు పెట్టుబడి సాయంగా ఉపయోగపడనుందని సమాచారం అందుతోంది. పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా డబ్బులు క్రెడిట్ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మూడు విడతల్లో నాలుగు నెలలకు ఒకసారి జమ చేస్తుండటం గమనార్హం. రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే ప్రధాన లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించి ఏటా రైతుల ఖాతాల్లో కేంద్రం నగదును జమ చేస్తుండటం గమనార్హం. 2019 సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి ఈ పథకం అమలు కానుంది. మన దేశంలోని 9 కోట్ల మందికి పైగా రైతులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందుతున్నారు.
రూ.20,000 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. . పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ లో నో యువర్ స్టేటస్ ట్యాబ్ ఎంచుకుని వివరాలను ఎంటర్ చేయడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడంతో పాటు స్కీమ్ నగదు ఖాతాలో జమయ్యాయో లేదో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
హోమ్ పేజీలో ఉన్న బెనిఫిషియరీ లిస్ట్ ట్యాబ్ ఎంచుకోవడం ద్వారా స్కీమ్ కు అర్హత ఉందో లేదో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 01124300606, 18001155266, 155261 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయడం ద్వారా పీఎం కిసాన్ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను, సందేహాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.