పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. powergrid.in అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నాలుగు రోజుల క్రితం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 12వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
2024 సంవత్సరం జనవరి నెలలో కంప్యూటర్ బేస్డ్ పరీక్షను నిర్వహించి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐతో మెట్రిక్యులేషన్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. అన్ లైన్ ద్వారా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. పీజీసీఐఎల్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
పరీక్ష నిర్వహించే తేదీలకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. దరఖాస్తు ఫీజు చెల్లింపుకు సైతం డిసెంబర్ 12వ తేదీ చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీల వల్ల నిరుద్యోగులకు ఎంతో మేలు జరగనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.