నిరుద్యోగులకు దక్షిణ రైల్వే అదిరిపోయే శుభవార్త.. భారీ వేతనంతో ఉద్యోగాలు?

దక్షిణ రైల్వే ఈ మధ్య కాలంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దక్షిణ రైల్వే నుంచి వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దక్షిణ రైల్వే నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలుకావడం గమనార్హం.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నర్సింగ్ సూపరిండెంట్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ నెల 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని తెలుస్తోంది. మొత్తం 28 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. బీఎస్సీ నర్సింగ్ చేసిన నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ వల్ల బెనిఫిట్ కలగనుంది.

42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ల ఆధారంగా సడలింపులు ఉంటాయని తెలుస్తోంది. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 44900 రూపాయల వేతనం లభించనుంది.

దక్షిణ రైల్వే ఉద్యోగ ఖాళీలకు ఎంపికైతే ఎన్నో బెనిఫిట్స్ ను కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది. దక్షిణ రైల్వేలో జాబ్స్ కు నోటిఫికేషన్ వల్ల నిరుద్యోగులకు భారీగా బెనిఫిట్ కలగనుంది.