దేశంలో నిరుద్యోగుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతుండగా నిరుద్యోగులు పెరుగుతున్న స్థాయిలో ఉద్యోగాల సంఖ్య మాత్రం పెరగడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగేలా వరుస జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ అవుతుండగా పోస్టల్ డిపార్టుమెంట్ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఈ జాబ్ నోటిఫికేషన్ హాట్ టాపిక్ అవుతోంది.
తమిళనాడు సర్కిల్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత కాగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష అనంతరం డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు అత్యంత భారీ వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. కనిష్టంగా 19900 నుంచి 63,200 రూపాయల వేతనం లభిస్తుంది. మొత్తం 58 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. 27 ఏళ్లలోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ జాబ్స్ కు అర్హులు.
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని తెలుస్తోంది. https://www.indiapost.gov.in/vas/pages/indiaposthome.aspx వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. సంస్థ చెన్నై అడ్రస్ కు స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.