ఏపీలో మహిళలకు అదిరిపోయే శుభవార్త.. 48 అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీలు?

Job-Vacancy

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ మహిళలకు అదిరిపోయే తీపికబురు అందించింది. 48 అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. అంగన్ వాడీ కార్యకర్తలతో పాటు మినీ అంగన్ వాడీ కార్యకర్తల ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కోసం ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. ఈ నెల 24వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.

ఆసక్తి, అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి పాసై స్థానికంగా నివాసం ఉండే మహిళలు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. 18 సంవత్సరాలు పూర్తి అయిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. పెళ్లైన మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.

పదో తరగతి పాస్ కావడంతో పాటు వేర్వేరు కేటగిరీల ఆధారంగా మార్కులు కేటాయించడం జరుగుతుంది. వితంతువులకు, మైనర్ పిల్లలు ఉన్న వితంతువులకు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. పూర్తి పారదర్శకతతో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.