టాటా మెమోరియల్ సెంటర్ నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా అదిరిపోయే తీపికబురు వెలువడింది. ఈ సంస్థలో ఉద్యోగం సాధించాలని భావించే నిరుద్యోగులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఏప్రిల్ 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది. tmc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 45 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారని తెలుస్తోంది. చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నర్సు- ‘ఎ’ ఉద్యోగ ఖాళీలతో పాటు మరికొన్ని ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్/పీహెచ్‌డీ డిగ్రీ/డిప్లొమా కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.
గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి డిగ్రీ ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. 27 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఆధారంగా వయో పరిమితికి సంబంధించి సడలింపులు ఉంటాయి.
రాత పరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి తుది ఎంపిక జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 78,800 రూపాయల వరకు వేతనం లభిస్తుందని తెలుస్తోంది.