ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు లక్షన్నర వేతనంతో?

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. నెలకు లక్షన్నర రూపాయల వేతనంతో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది. మొత్తం 102 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఏడాది జనవరి నెల 5వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి నెల 29వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

oil-india.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 102 పోస్టులలో గ్రేడ్ ఎ ఉద్యోగ ఖాళీలు 1 ఉండగా గ్రేడ్ బి ఉద్యోగ ఖాళీలు 97, గ్రేడ్ సి ఉద్యోగ ఖాళీలు 4 ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు ఉద్యోగాలకు పోస్టుల విద్యార్హత,వయోపరిమితి భిన్నంగా ఉండనుంది.

జనరల్ అభ్యర్థులకు రూ. 500 + ట్యాక్స్ దరఖాస్తు ఫీజుగా ఉండగా మిగతా అభ్యర్థులకు మాత్రం ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదని తెలుస్తోంది. రాత పరీక్ష,ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.

గ్రేడ్ ఏ ఉద్యోగులకు 90 వేల రూపాయల వేతనం లభించనుండగా గ్రేడ్ బి ఉద్యోగులకు లక్షా 20 వేల రూపాయలు, గ్రేడ్ సి ఉద్యోగులకు లక్షా 50 వేల రూపాయల వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.