దేశంలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే విద్యార్థుల సంఖ్య పెరిగిన స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరగకపోవడం గమనార్హం. అయితే బీటెక్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీక భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం.
ntpc.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా 66 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.
కనీసం 60 శాతం మార్కులతో బీటెక్ పాసైన వాళ్లు 7 ఏళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌పీరియన్స్ తో పాటు సబ్ స్టేషన్, పవర్ స్టేషన్లలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) విభాగంలో దరఖాస్తు చేసేవాళ్లకు కూడా ఏడేళ్ల అనుభవం తప్పనిసరి అని చెప్పవచ్చు. స్టీమ్ టర్బైన్ & జనరేటర్ విభాగాల్లో అనుభవం ఉన్నవాళ్లు ఈ విభాగంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 300 రూపాయిలుగా ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 60,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.