పేద ప్రజలకు మోదీ సర్కార్ మరో తీపికబురు.. ఆ స్కీమ్ తో నెలకు రూ.3,000 పొందే ఛాన్స్!

కేంద్ర ప్రభుత్వం కొన్ని వందల పథకాలను అమలు చేస్తుండగా ఆ పథకాలలో చాలా పథకాల గురించి ప్రజలకు సరైన అవగాహన లేదు. ఈ-శ్రమ పేరుతో కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు మేలు చెయ్యాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఆధార్ కార్డ్ ను కలిగి ఉన్నవాళ్లు సులువుగా ఈ శ్రమ్ కార్డ్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ శ్రమ్ కార్డ్ ను కలిగి ఉన్నవాళ్లు సులువుగా ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు

ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ పేరుతో ఈ స్కీమ్ అమలవుతోంది. ఈ స్కీమ్ కు అర్హత పొందిన వాళ్లు 60 ఏళ్ల వయసు వచ్చాక నెలకు రూ.3000 పెన్షన్ పొందే అవకాశాలు ఉంటాయి. ఈ-శ్రమ కార్డు పొందిన వారు లైఫ్ ఇన్సూరెన్స్ పొందే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఉన్నవాళ్లకు దివ్యాంగులైన వారికి ఆర్థిక సాయం కూడా లభించే అవకాశాలు అయితే ఉంటాయి.

నిజమైన కార్మికులు ప్రయోజనం పొందాలని భావించి కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా నిజమైన కార్మికలను గుర్తిస్తూ వాళ్లకు సంక్షేమ ఫలాలను అందిస్తోంది. ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ కలిగి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు ఉంటాయి. https://eshram.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

14434 నంబర్ కు కాల్ చేయడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. ఈ స్కీమ్ వల్ల నిజమైన కార్మికులు దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.