ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఆ జిల్లాలో భారీగా అంగన్ వాడీ ఉద్యోగాలు?

Job-Vacancy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత నుంచి 25 వ‌ర్క‌ర్లు, హెల్ప‌ర్లు, మినీ అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం.

వేర్వేరు ఊర్లలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో మేలు జరగనుంది. కనీసం పదో తరగతి పాసై తెలుగులో చదవడం, రాయడం వచ్చిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.

స్థానికంగా నివశిస్తూ వివాహిత అయిన మహిళలు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో మేలు జరుగుతుందని తెలుస్తోంది.

రిజర్వేషన్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతోంది.