హీరోయిన్లకు సినిమాల్లో సక్సెస్ ఎంత ముఖ్యమో.. ఆ సక్సెస్ దక్కడానికి అందాన్ని కాపాడుకోవడమూ అంతే ముఖ్యం. సినిమా సినిమాకో కొత్త హీరోయిన్ వచ్చేస్తున్న రోజులివి. మరి.. ఇంత హెవీ కాంపెటిషన్ లో మరింతగా సౌందర్యాన్ని కాపాడుకోవడం అంతే ముఖ్యం. హీరోయిన్లకు ముఖ సౌందర్యం మాత్రమే కాదు. స్కిన్ బ్యూటీ అంతే ముఖ్యం. అందుకే బ్యూటీ పార్లర్స్ కి ఎక్కువగా వెళ్తూంటారు. దీంతోపాటు అండర్ ఆర్మ్స్ కూడా నీట్ గా ఉండాల్సిందే. పాటలతోపాటు ఒక్కోసారి సందర్భాన్ని బట్టి సినిమాలో స్లీవ్ లెస్ లు ధరించాల్సి వస్తుంది. ఆ సమయంలో అండర్ ఆర్మ్స్ నీట్ గా కనిపించాల్సిందే. అయితే.. హీరోయిన్ల అండర్ ఆర్మ్స్ ఉన్నంత నీట్ నెస్ సాధారణ యువతుల్లో ఉండదనే చెప్పాలి.
అయితే.. ఇదేమంత సమస్య కాదు కానీ కొన్ని చిట్కాలు తప్పనిసరిగా పాటించాలని అంటున్నారు నిపుణులు. సాధారణ యువతులు అందంపై పెట్టే శ్రద్ధ అండర్ ఆర్మస్ పై పెద్దగా పెట్టకపోవచ్చు. చర్మం మృదువుగా ఉండేందకు అనేక లోషన్లు వాడతారు. బ్యూటీ పార్లర్స్ కు వెళ్తారు. ఇందుకు హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి. అయితే.. అండర్ ఆర్మ్స్ అందంగా, తెల్లగా ఉంచుకోవడానికి పెద్దగా చిట్కాలు లేవనే చెప్పాలి. కానీ.. కొన్ని పద్ధతులు పాటిస్తే మాత్రం హీరోయిన్ల మాదిరిగానే అండర్ ఆర్మ్స్ కూడా నీట్ గా ఉంటాయని అంటున్నారు.
స్నానం చేసిన తర్వాత అండర్ ఆర్మ్స్ ను శుభ్రం చేసేందుకు ప్రత్యేకంగా దొరికే మాయిశ్చరైజర్స్ రాయాలి. దీనివల్ల అండర్ ఆర్మ్స్ లో బ్లాక్ మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. సెన్సిటివ్ గా ఉండే ప్రదేశం కాంబట్టి వారానికి ఒకసారి సున్నితంగా ఉండే స్కబ్బర్స్ తో రుద్దుతూ ఉండాలి. అండర్ ఆర్మ్స్ లో ఉండే హెయిర్ ను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి. ఇక మార్కెట్ లో దొరికే క్రీములు వాడకపోవడమే బెటర్. కెమికల్స్ ఎక్కువగా ఉంటే మరింత నల్లగా మారే అవకాశం ఉంటుంది. తరచుగా ఇలా చేయడం వల్ల బ్లాక్ మార్క్స్ తగ్గి అండర్ ఆర్మ్స్ అందంగా.. స్లీవ్ లెస్ డ్రస్ వేసుకునేందుకు అనువుగా ఉంటుంది.