నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.లక్ష వేతనంతో?

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్,హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 119 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఒక్కో ఉద్యోగానికి ఒక్కో తరహా నిబంధనలు ఉండగా అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 9300 రూపాయల నుంచి 112400 రూపాయల వరకు వేతనం లభించనుంది. ఎన్.ఐ.ఏ ప్రధాన కార్యాలయం అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీల విషయంలో అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ కూడా ఒకింత ఎక్కువగానే ఉండనుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది.