బంగారం ఉన్నవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ రూల్స్ మారుతున్నాయని తెలుసా?

gold

మన దేశంలో చాలామంది సంపాదించిన డబ్బులను ప్రధానంగా బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే బంగారం అమ్మకాల నిబంధనలు మారబోతున్నాయి. బంగారం అమ్మేవాళ్లు కొన్ని విషయాలకు సంబంధించి పూర్తిస్థాయిలో అవగాహనను కలిగి ఉంటే మంచిదని చెప్పవచ్చు.

హాల్ మార్కింగ్ అనేది బంగారం స్వచ్చతకు హామీ కాగా ప్రతి బంగారం ఆభరణంపై ఉండే హాల్ మార్క్ ద్వారా ఆ బంగారానికి సంబంధించిన్ పూర్తి విషయాలను సులువుగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లోగోతో పాటు స్వచ్చతను ఈ హాల్ మార్క్ ద్వారా తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో బంగారాన్ని అమ్మడం జరుగుతుంది.

బంగారాన్ని విక్రయించాలని భావించే వాళ్లు కొన్ని నియమ నిబంధనల గురించి తెలుసుకోవడం వల్ల ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వచ్చే నెల 1వ తేదీ నుంచి కేంద్రం హాల్ మార్కింగ్ నిబంధనలకు సంబంధించి చాలా మార్పులు చేస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి హాల్ మార్కింగ్ లేని బంగారాన్ని విక్రయించడం సాధ్యం కాదు.

బంగారం స్వచ్చతకు హామీగా హాల్ మార్క్ గుర్తు ఉపయోగపడుతుంది. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేవాళ్లు మోసపోకుండా ఉండాలనే ఆలోచనతో కేంద్రం ఈ నిబంధనలను అమలు చేస్తోంది. కొత్తగా బంగారంను కొనుగోలు చేసేవాళ్లు హాల్ మార్కింగ్ ఉన్న బంగారం కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.