నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీ వేతనంతో ఉద్యోగాలు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూసేవాళ్లకు ప్రయోజనం చేకూరేలా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. నావల్ డాక్‌యార్డ్-ముంబై‌లో అప్రెంటిషిప్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. portal.mhrdnats.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముంబై నావల్ డాక్‌యార్డ్‌లో మొత్తం 301 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వేర్వేరు పోస్టులు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఫిట్టర్ ఉద్యోగ ఖాళీలు 50 ఉండగా మాసన్(బీసీ) ఉద్యోగ ఖాళీలు 8, ఐ&సీటీఎస్‌ఎం ఉద్యోగ ఖాళీలు 34, ఎలక్ట్రిషియన్ 40, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 26 ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎలక్ట్రోప్లేటర్ 1 భర్తీ కానుండగా ఫౌండరీ మాన్-1 ఎంఎంటీఎం 13 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఎక్యూప్‌మెంట్ మెకానిక్ ఉద్యోగ ఖాళీలు 7 ఉండగా మెకానిక్(డీజిల్) ఉద్యోగ ఖాళీలు 35 ఉన్నాయి. 14 ఏళ్ల నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. 2002 నవంబరు 21 నుంచి 2009 నవంబరు 21 మధ్య జన్మించినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

నాన్-ఐటీఐ అప్రెంటిస్‌షిప్‌ పోస్టులకు కనీసం ఎనిమిదో తరగతి పాసైన వాళ్లు అర్హులు కాగా మిగతా ఉద్యోగాలకు పదో తరగతి అర్హతగా ఉంటుంది. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ అధికారిక పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. నావల్ డాక్‌యార్డ్-ముంబై అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్-2024 ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చెల్లించడంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.