పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో జూనియర్ ఇంజనీర్ జాబ్స్.. భారీ వేతనంతో?

నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. nwda.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఆన్ లైన్ లో ఈ వెబ్ సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 40 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 2023 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. చాలారోజుల క్రితమే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో వేగంగా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు వేగంగా చేసుకుంటే మంచిది.

జూనియర్ ఇంజనీర్, జూనియర్ అకౌంటెంట్స్, డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ ఉద్యోగ ఖాళీలతో పాటు లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజిన్ క్లర్క్, స్టెనో గ్రాఫర్ గ్రేడ్2 ఉద్యోగ ఖాళీలను సైతం ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగాన్ని బట్టి విద్యార్హతలలో మార్పులు ఉంటాయని సమాచారం అందుతోంది. 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 890 రూపాయలుగా ఉంటుందని సమాచారం అందుతోంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా లక్ష రూపాయల వరకు వేతనం లభించనుంది.