నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో భారీగా ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.83 వేల వేతనంతో?

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్, ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) పోస్టుల భర్తీ కోసం ఎన్టీపీసీ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

మొత్తం 63 పోస్టులను ఎన్టీపీసీ ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ జరగనుంది. ఏప్రిల్ 13 వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం అర్హత కలిగి ఉంటారు. జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులకు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం మొత్తం రూ.83000 చెల్లించడం జరుగుతుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఢిల్లీ/నోయిడాలో ఆన్ లైన్ రాత పరీక్షను నిర్వహిస్తున్నారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది.

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో పని చేయాలని భావించే వాళ్లకు మాత్రం ఈ జాబ్ నోటిఫికేషన్ బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఎన్టీపీసీ జాబ్ నోటిఫికేషన్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి బెనిఫిట్ కలగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఒకింత టఫ్ కాంపిటీషన్ ఉండనుంది.