నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1, అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 40 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మార్చి నెల 2వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1, అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 56 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు, అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా రూ. 1,12400 వేతనం లభిస్తుంది.
అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 81100 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు సంస్థ న్యూఢిల్లీ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్ కలుగుతుంది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఉద్యోగ ఖాళీలపై ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళ్లీలపై వెంటనే ఫోకస్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది. ఎక్కువ మొత్తం వేతనం లభిస్తుండటంతో అనుభవం ఉన్న ఉద్యోగులకు సైతం ప్రయోజనం చేకూరనుంది.