తెలుగు సంవత్సరాల పేర్లు తెలుసా?

చాలా సంస్కృతులతో సంవత్సరాలకు పేర్లున్నాయి.చైనా లో సంవత్సరాలకు జంతువుల పేర్లున్నాయి, చైనా లో ఇపుడు నడుస్తున్నది శునక నామ సంవ్సతరం. వచ్చేది వరాహం. అలాగే తెలుగు వారి సంవత్సరాలకు పేర్లున్నాయి. తెలుగువారిది అరవై సంవ్సరాల వలయం. ఇపుడు నడుస్తున్న వలయం 1987 – 88 తో (ప్రభవ) మొదలయింది. 2047 – 48 (అక్షయ)తో అది ముగుస్తుంది. ఎపుడో ఉగాది రోజున తప్ప ఈ పేర్లు వినిపించవు. పూర్వం పాఠశాలలో ఈ పేర్లను వల్లెవేయించడం జరిగేది. ఆ రోజుల్లో విద్యార్థులందరూ ఈ 60 పేర్లను అలవోకగా చెప్పే వారు. ఇపుడు చెప్పే విద్యార్థులు అరుదు. ఇవే 60 తెలుగు సంవత్సరాల పేర్లు:

1 . ప్రభవ (1987 – 88)
2 . విభవ (1988 -89)
3 . శుక్ల (1989 -90)
4 . ప్రమోదూత (1990 -91)
5 . ప్రజోత్పత్తి (1991 – 92)
6 . అంగీరస (1992 -93)
7 . శ్రీముఖ (1993 -94)
8 . భవ (1994 – 95)
9 . యువ (1995 – 96)
10 . దాత (1996 – 97)
11 . ఈశ్వర (1997 -98)
12 . బహుధాన్య (1998 -99)
13 . ప్రమోది (1999 -2000)
14 . విక్రమ (2000 -01)
15 . వృష (2001 -02)
16 . చిత్రభాను (2002 -03)
17 . స్వభాను (2003 -04)
18 . తారణ (2004 -05)
19 . పార్ధివ (2005 – 06)
20 . వ్యయ (2006 -07)
21 . సర్వజిత్తు (2007 -08)
22 . సర్వధారి (2008 -09)
23 . విరోధి (2009 -10)
24 . వికృతి (2010 -11)
25 . ఖర (2011 -12)
26 . నందన (2012 -13)
27 . విజయ (2013 -14)
28 . జయ (2014 -15)
29 . మన్మధ (2015 -16)
30 . దుర్ముఖి (2016 -17)
31 . హేవిళంభి (2017 -18)
32 . విళంబి (2018 -19)
33 . వికారి (2019 -20)
34 . శార్వరి (2020 -21)
35 . ప్లవ (2021 -22)
36 . శుభకృతి (2022 -23)
37 . శోభకృతు (2023 -24)
38 . క్రోధి (2024 -25)
39 . విశ్వావసు (2025 -26)
40 . పరాభవ (2026 -27)
41 . ప్లవంగ (2027 -28)
42 . కీలక (2028 -29)
43 . సౌమ్య (2029 -30)
44 . సాధారణ (2030 -31)
45 . విరోధికృతు (2031 -32)
46 . పరీధావి (2032 -33)
47 . ప్రమోదీచ (2033 -34)
48 . ఆనంద (2034 -35)
49 . రాక్షస (2035 -36)
50 . నల (2036 -37)
51 . పింగళ (2037 -38)
52 . కాళయుక్తి (2038 -39)
53 . సిద్దార్ద (2039 -40)
54 . రౌద్రి (2040 -41)
55 . దుర్మతి (2041 -42)
56 . దుందుభి (2042 -43)
57 . రుధిరోద్గారి (2043 -44)
58 . రక్తాక్షి (2044 -45)
59 . క్రోధన (2045 -46)
60 . అక్షయ (2046 -47)